సోమవారం 30 మార్చి 2020
Medak - Mar 04, 2020 , 01:08:04

పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కరించాలి

పట్టణ ప్రగతిలో  సమస్యలు పరిష్కరించాలి

మెదక్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతిలో వార్డుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి జోరుగా సాగుతుంది.  మంగళవారం పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, కౌన్సిలర్లు  వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వార్డుల్లో పారిశుధ్యం విషయంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌  మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం పట్టణంలో జోరుగా కొనసాగుతుందన్నారు. ప్రతి రోజు మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, ఆయా కమిటీల సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుందన్నారు. వార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులో కమిటీ సభ్యులు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలకు చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందని, మహిళలు తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్‌ సిబ్బందికి అందజేయాలని సూచించారు. పట్టణ ప్రగతి కోసం మెదక్‌ మున్సిపాలిటీకి రూ.93 లక్షలు ప్రభు త్వం కేటాయించిందని తెలిపారు. 

ప్రజల భాగస్వామ్యంతోనే ‘పట్టణ ప్రగతి’

మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ అన్నారు.  పట్టణ ప్రగతిలో భాగంగా 23, 24, 25 వార్డుల్లో కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 32 వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. మహిళలకు అందించిన చెత్త బుట్టలలో తడి, పొడి చెత్తను వేరు చేసి  మున్సిపల్‌ సిబ్బందించి అందించాలన్నారు.  ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆయా వార్డుల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, వాటిని సిబ్బందితో శుభ్రం చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్‌ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


logo