సోమవారం 30 మార్చి 2020
Medak - Mar 03, 2020 , 05:15:05

సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం

 సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం
  • పల్లెనిద్ర కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్‌ హేమలతా శేఖర్‌గౌడ్‌

పెండింగ్‌లో ఉన్న పల్లెప్రగతి పనులను పరిశీలించి, సమస్యలు లేని గ్రామాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం జీడిపల్లిలో సోమవారం రాత్రి నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 - మనోహరాబాద్‌


మనోహరాబాద్‌ : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో అనతికాలంలోనే ఆదర్శగ్రామాలుగా పల్లెలు అభివృద్ధి చెందాయని జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం రాత్రి   మండలంలోని జీడిపల్లిలో నిర్వహించిన పల్లె నిద్రలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్‌  అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.  మొదటి, రెండో విడుత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతుందన్నారు.  ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డంపింగ్‌యార్డులు, మిషన్‌భగీరథ, పంచాయతీభవనాలు, వైకుంఠధామాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు జరిగాయన్నారు. ప్లాస్టిక్‌ నిషేదం, హరితహారంపై దృష్టి ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. విధిగా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు.  పెండింగ్‌ పనులను పరిశీలిందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలోనే సేదతీరారు. మంగళవారం ఉదయం ఇంటింటికీ తిరుగనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి  సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్‌, పీఆర్‌ ఈఈ విజయప్రకాశ్‌, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ స్వర్ణ, సర్పంచ్‌ రేఖామల్లేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు ర్యాకల కృష్ణాగౌడ్‌, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo