సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Mar 01, 2020 , 23:43:29

నిరుపేద సిక్కు, బంజారాలకు అన్నిరకాల వైద్యసేవలు

నిరుపేద సిక్కు, బంజారాలకు  అన్నిరకాల వైద్యసేవలు
  • నార్సింగి మండలం సంకాపూర్‌ తండాలో
  • ఉచిత వైద్యశిబిరం
  • సిక్కు దేవాలయంలో ప్రత్యేక ప్రార్థన చేసిన
  • అనంతరం వైద్యశిబిరాన్ని పరిశీలించిన
  • తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్‌

చేగుంట : నిరుపేద గ్రామీణ సిక్కు బంజారా ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా నార్సింగి మండలం సంకాపూర్‌ తండాలో వైద్యశిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ స్పెషల్‌ఫోర్స్‌ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్‌ పేర్కొన్నారు. శ్రీ గురుహర్‌ రాయ్‌ సాహెబ్‌ 390వ జయంతి సందర్భంగా ఆదివారం తండాలోని సిక్కు దేవాలయం వద్ద వివిధ రకాల జబ్బులకు సంబంధించి 50 మంది డాక్టర్ల పర్యవేక్షణలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తేజ్‌దీప్‌కౌర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తండాలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి అన్నిరకాల వైద్యసేవలను అందించడం జరుగుతుందన్నారు. వైద్య పరిక్షలు చేసి అవసరం ఉన్న వారికి మందులను అందజేయడంతో పాటు శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం సిక్కు దేవాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో, భజన కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వాహకులు డాక్టర్‌.లక్ష్మణ్‌ సింగ్‌, సంకాపూర్‌ గురుద్వారా కమిటీ సభ్యులతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.


logo