గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Mar 01, 2020 , 00:55:33

ప్రజల భాగస్వామ్యంతోనే ‘పట్టణప్రగతి’ సాధ్యం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

ప్రజల భాగస్వామ్యంతోనే ‘పట్టణప్రగతి’ సాధ్యం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ : ప్రజల భాగస్వామ్యంతోనే ‘పట్టణప్రగతి’ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో ‘పట్టణప్రగతి’ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. శనివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి,  మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, కమిషనర్‌ రమణమూర్తి ‘పట్టణప్రగతి’ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి 15వ వార్డులో పారపట్టి చెత్తను తొలగించారు. 

 అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులను శాలువాతో సన్మానించారు. 2వ వార్డులో జరుగుతున్న పట్టణప్రగతి పనులను పరిశీలించారు. 12వ వార్డులో కుమ్మరిసంఘం శ్మశాన వాటికను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు మాలతి, హేమభార్గవి, కౌన్సిలర్లు లలిత, లత టీఆర్‌ఎస్‌ నాయకులు భిక్షపతి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>