గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 25, 2020 , 04:36:29

రోడ్లపై చెత్త వేస్తే.. జరిమానా

రోడ్లపై చెత్త వేస్తే.. జరిమానా
  • పట్టణ రూపురేఖలు మారాలి
  • ప్లాస్టిక్‌ రహిత సంగారెడ్డిని తీర్చిదిద్దాలి
  • చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ఆటోలు
  • మొక్కలు నాటి సంరక్షించాలి
  • యువతకు క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు
  • కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు అవగాహన ఉండాలి
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి మున్సిపాలిటీ/ సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: ప్రజలు ఇంట్లో చెత్తను రోడ్డుపై వేస్తే జరిమానా విధిస్తారని, మున్సిపల్‌ అధికారులు ఏ ర్పాటు చేసిన ట్రాక్టర్లు, ఆటోల్లో చెత్తను వేయాలని, కలిసికట్టుగా పట్టణాల రూపురేఖలు మార్చు కుందామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిరోడ్లపై చెత్త వేస్తే.. జరిమానా


చ్చారు. సోమవారం సంగారెడ్డిలోని 8వ వార్డు నారాయణరెడ్డి కాలనీలోని ఎల్లమ్మకట్ట ప్రాంతంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పాదయాత్ర చేస్తూ కాలనీవాసుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు రోజు విడిచి రోజు చెత్త బండి వస్తుందని, కరెంట్‌ సమస్యలు ఉన్నాయని, గ్యాస్‌ సిలిండర్లు లేవని, రేషన్‌ సరుకులు సరిగ్గా ఇవ్వడం లేదని మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించి చెత్త సేకరణకు బండ్లు వెళ్తున్నాయా లేదా అని మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇండ్లపై  కరెంటు తీగలు ప్రమాదకరంగా ఉంటే సరిచేసి పరిష్కరించాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. గ్యాస్‌ సిలిండర్లు లేనివారికి, రేషన్‌ సరుకులు సరఫరా చేయని డీలర్‌పై చర్యలు తీసుకుని ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అనంతరం ఎల్లమ్మకట్టపై ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమావేశంలో మంత్రి మాట్లాడారు. పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా చెత్త వేస్తే రూ.500 జరిమానాకు గురవుతారని ప్రజలకు మంత్రి హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి మున్సిపాలిటీల రూపురేఖలు మారేందుకు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. సీఎం లక్ష్యాన్ని నెరవేర్చడానికి పట్టణ వాసులు త మవంతు బాధ్యతగా నివాసాలతో పాటు కాలనీలను పరిశుభ్రంగా చేసుకోవాలన్నా రు.  ప్లాస్టిక్‌ను నిషేధించి ప్లాస్టిక్‌ రహిత సంగారెడ్డి పట్టణంగా తీర్చిదిద్దాలని కోరారు. 


యువత మొక్కలు నాటి కాపాడాలి...

అన్ని వార్డుల్లోని బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలని యువతకు మంత్రి పిలుపునిచ్చారు. దీంతో పట్టణం హరితవనంగా తయారై పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలి, నీడ, ఫలాలు అందిస్తాయన్నారు. యువకులు ముందుకు వచ్చి 300 మొక్కలు నాటి సంరక్షించి బతికిస్తే పట్టణ భవిష్యత్‌ రూపురేఖలు మారుతాయన్నారు. యువత పెడదారిన పట్టకుండా కాలనీల్లో క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇండ్ల స్థలాలకు ఓనర్‌ షిప్‌ ధ్రువపత్రాలు రెండు నెలల్లో కలెక్టర్‌ చేతుల మీదుగా ఇప్పించ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దళారులకు తావు ఇవ్వకుండా లంచాలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలని ప్రజలకు మంత్రి సూచించారు.  


logo
>>>>>>