ఆదివారం 29 మార్చి 2020
Medak - Feb 25, 2020 , 03:23:37

పది పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి

పది పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి
  • ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ విధించాలి
  • జిల్లా అధికారులతో కలెక్టర్‌ ధర్మారెడ్డి సమావేశం

మెదక్‌, నమస్తే తెలంగాణ : పది పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6వ వరకు జరుగబోయే పదో తరగతి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద విధిగా 144 సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్ర ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అదే విధంగా మొబైల్‌ మెడికల్‌ వాహనాలను కూడా ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావును ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య సిబ్బంది కచ్చితంగా హాజరుకావాలని సూచించారు. పరీక్షల సమయానికి, పరీక్షా సమయం ముగిసిన తర్వాత అన్ని రూట్లలో విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా బస్సులు నడుపాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. పరీక్షలు జరుగు రోజుల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సురక్షితమైన మంచినీరు విద్యార్ధులకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌, పరీక్షా విభాగం సహాయ సంచాలకులు ఎం.భాస్కర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, నోడల్‌ అధికారి మధుమోహన్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ఎంవీఐ శ్రీనివాస్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ రఘునాథ్‌, తపాలశాఖ అధికారి వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.


logo