గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 22, 2020 , T00:05

అంతర్జాతీయ స్థాయి సాంబో పోటీలకు క్రీడాకారుల ఎంపిక

అంతర్జాతీయ స్థాయి సాంబో పోటీలకు క్రీడాకారుల ఎంపిక

చేగుంట : అంతర్జాతీయ సాంబో పోటీలకు మెదక్‌ జిల్లా చేగుంట, వెల్దుర్తి  క్రీడాకారులు మల్లీశ్వరి, శ్రీజలు ఎంపికైనట్లు కోచ్‌ కరణం గణేశ్వ్రికుమార్‌ శుక్రవారం తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో పుణేలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన 10వ జాతీయస్థాయి సీనియర్‌ సాంబో పోటీల్లో 64 కిలోల స్పోర్ట్స్‌ సాంబో ఈవెంట్‌లో మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన విద్యార్థిని కరణం మల్లీశ్వరి బంగారు పతకం సాధించి, సెప్టెంబర్‌లో గ్రీస్‌ దేశంలో జరిగే పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. దీంతో పాటు జూనియర్‌ స్పోర్ట్స్‌ సాంబో68కిలోల విభాగంలో వెల్దుర్తి జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రీజ వెండి పతకం సాధించి అంతర్జాతీయ పోటీలకు స్టాండ్‌ బైగా ఎంపికైనట్లు, ఎంపికైన వీరికి ఆసియన్‌ సాంబో యూనియన్‌ వైస్‌ ప్రెసిడింట్‌ అబ్దులోవ్‌ మక్ముద్‌, సాంబో ఇండియా సెక్రటరీ జనరల్‌ డిప్యూటీ రాంశర్మ నుంచి బహుమతులు అందుకున్నట్లు గణేశ్వ్రికుమార్‌ తెలిపారు. సాంబో జాతీయస్థాయి పోటీలకు 16 రాష్ర్టాల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వీరి ఎంపికపై ఉస్మానియా ప్రిన్సిపాల్‌ రాజేశ్‌కుమార్‌, వెల్దుర్తి జెడ్పీ హెచ్‌ఎస్‌ ప్రతాప్‌సింగ్‌లు హర్షం వ్యక్తం చేశారు.


logo