బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 18, 2020 , 23:53:04

ఘనంగా బోనాలు

ఘనంగా బోనాలు

మెదక్‌ టౌన్‌ ; మెదక్‌ పసుపులేరు ప్రక్కన వెలసిన రేణుకామాత ఆలయ 26వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో బోనాలతో తరలివచ్చారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, మొక్కులు తీర్చుకున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి బోనమెత్తి అమ్మవారిని దర్శించు కున్నారు. మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌ గౌడ్‌ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.


జిల్లా కేంద్రంలోని పసుపులేరు ప్రక్కన వెలసిన రేణుకామాత ఆలయంలో26వ వార్షికోత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి రోజు మంగళవారం ఉదయం  రేణుక ఆల యం వద్ద భక్తుల సందడి నెలకొంది.  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి  అలంకరించిన బోనాలను  మహిళలు ఊరేగించారు. పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు శివసత్తుల పూనకాల, మధ్య అంగరంగ వైభవంగా బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్‌ చంద్రపాల్‌ , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, ఆలయ చైర్మన్‌ కొండ సురేందర్‌గౌడ్‌, మెదక్‌ పట్టణ గౌడ సంఘం అధ్యక్షు కృష్ణగౌడ్‌, మున్సిపల్‌  శాం తాగౌడ్‌, రాజలింగంగౌడ్‌,నర్సింహులుగౌడ్‌, ఆరెళ్ళ జనార్దన్‌గౌడ్‌, మంగనారాగౌడ్‌, ముత్యంగౌడ్‌, నాగభూషణంగౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, గౌడ పాల్గొన్నారు.


logo