శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 18, 2020 , 01:40:33

పుట్టిన రోజున పచ్చ తోరణం

పుట్టిన రోజున పచ్చ తోరణం

జన హృదయ నేత పుట్టిన రోజును జిల్లా వాసులు హరిత వేడుకగా చేసుకున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా హరిత స్ఫూర్తితో కదిలారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇలా అందరూ మెతుకు సీమకు పచ్చతోరణంలా మొక్కలు నాటారు.

జన హృదయ నేత పుట్టిన రోజును జిల్లా వాసులు హరిత వేడుకగా చేసుకున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా హరిత స్ఫూర్తితో కదిలారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇలా అందరూ మెతుకు సీమకు పచ్చతోరణంలా మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటుదామని ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, జెడ్పీ  చైర్‌పర్సన్‌ హేమలతా శేఖర్‌గౌడ్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి.. ఇంకా మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు  విస్తృతంగా మొక్కలు నాటారు. పలుచోట్ల కేక్‌లు కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. ఇంకొందరు దవాఖానల్లో  పండ్లుపంపిణీ చేశారు. మరికొందరు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.  నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే  కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నమస్తే తెలంగాణ బృందం మేముసైతం అంటూ మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటింది.

- మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఊరూ.. వాడా.. ఉప్పెనై కదిలింది. ప్రతి పల్లె హరితారణ్యం అయ్యింది. ‘హరిత’ సంబురం అంబరాన్ని తాకింది. సీఎం కేసీఆర్‌ 66వ జన్మదినం పురస్కరించుకుని మెతుకుసీమలో చేపట్టిన హరితహారం ఉద్యమాన్ని తలపించింది. పల్లె, పట్నం ఒకటిగా ముందుకు కదిలింది. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది.  ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేంరద్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఎస్పీ చందనదీప్తి, డీపీవో హనోక్‌, అటవీశాఖ సీసీఎఫ్‌ శరవణ్‌తో పాటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్‌, రైతుసమన్వయ సమితి, మహిళా సంఘాల సభ్యులు అందరూ సీఎం కేసీఆర్‌ 66వ జన్మదినం సందర్భంగా మొక్కలను నాటారు. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కేక్‌కట్‌చేసి పంప్‌హౌస్‌ వద్ద మొక్కలను నాటారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 


మరోవైపు ‘నమస్తే తెలంగాణ’ బృందం జిల్లా కేంద్రం నుంచి మొదలుకుని మండల కేంద్రాలలో, గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలసి మొక్కలను నాటారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు మనోహరాబాద్‌ మండలం పోతారం, తుపాకులపల్లి, గౌతోజిగూడెంలో మొక్కలను నాటారు. మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లిలో జెడ్పీ చైర్‌ పర్సన్‌, కలెక్టర్‌ లు మొక్కలను నాటారు. . ఎస్పీ చందనదీప్తి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంతో పాటు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మొక్కలను నాటారు. పోచారం అభయారణ్యంలో అటవీశాఖ సీసీఎఫ్‌ శరవణ్‌ ఆధ్వర్యంలో డీఎఫ్‌వోలు పద్మజారాణి మొక్కలను నాటారు. జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మీ సేవా కేంద్రాల ఆవరణలో మొక్కలను నాటారు. 


మనోహరాబాద్‌లో ‘నమస్తే తెలంగాణ’ బృందం ఆధ్వర్యంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డిలు మొక్కలు నాటారు. శివ్వంపేట మండలం గంగాయపల్లిలో ‘నమస్తే తెలంగాణ’ బృందం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మొక్కలను నాటారు. ఇదిలా వుండగా అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి దండుపల్లి వద్ద మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కౌడిపల్లి, నర్సాపూర్‌లో ‘నమస్తే తెలంగాణ’ బృందం ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. 


‘నమస్తే తెలంగాణ’ జిల్లా బృందం ఆధ్వర్యంలో మెదక్‌ మండలం మంబోజిపల్లి ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్‌ ధర్మారెడ్డి, విద్యార్థులు, డీపీవో హనోక్‌, ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, ఆర్డీవో సాయిరాం, ఎమ్మార్వో రవికుమార్‌, ఎంపీడీవో రాంబాబు, సర్పంచ్‌ గంజి ప్రభాకర్‌, ఉపాధ్యాయులతో పాఠశాల ఆవరణలో 20 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యార్థులతో మాట్లాడుతూ తల్లిదండ్రుల వలే మీరు మొక్కలను కాపాడండని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలకు స్పోర్ట్స్‌ కిట్‌ను మంజూరు చేశారు. 


సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నర్సాపూర్‌, కౌడిపల్లిలో కేజీబీవీ పాఠశాలలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మొక్కలను నాటారు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో కస్తూర్బా గాంధీ విద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో కలసి ‘నమస్తే తెలంగాణ’ బృందం ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. అన్ని మండలాలు రామాయంపేట, నిజాంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, టేక్మాల్‌, చేగుంట, వెల్దుర్తి, రేగోడ్‌, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, కొల్చారం తదితర మండలాల్లో ‘నమస్తే తెలంగాణ’ బృందం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటారు.  


logo