బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 18, 2020 , 01:36:30

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆ భగవంతుడిని కోరారు. సోమవారం జిల్లా కేంద్రమైన మెదక్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, అభిమానులు సీఎం కేసీఆర్‌

మెదక్‌, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆ భగవంతుడిని కోరారు. సోమవారం జిల్లా కేంద్రమైన మెదక్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, అభిమానులు సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ముందుగా మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి కేక్‌ను తినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని  పురస్కరించుకుని మొక్కలు నాటాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ముఖ్యంగా పట్టణంలో రహదారుల నిర్మాణంతో పాటు మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ.50 కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.  


సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే  

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిండు నూరేండ్లు చల్లంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. మెదక్‌ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 


మొక్కలు నాటిన ఎమ్మెల్యే..

సోమవారం సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌లోని మార్కెట్‌ కమిటీ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కాస సూర్యతేజ పరీక్ష ప్యాడ్‌లను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి అందజేశారు. 


జిల్లా కేంద్ర దవాఖానలో పండ్లు పంపిణీ 

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్ర దవాఖానలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ రోగులకు పండ్లను పంపిణీ చేసి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


మెదక్‌లో అన్నదాన కార్యక్రమం 

జిల్లా కేంద్రమైన మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తాలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు రాగి వనజ, బట్టి లలిత, వంజరి జయరాజ్‌, సమీయొద్దీన్‌, లక్ష్మీనారాయణగౌడ్‌, కిశోర్‌, యువ న్యాయవాది జీవన్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మందుగుల గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కాస సూర్యతేజ, ఎంపీపీ వైస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు చల్ల నరేందర్‌, శ్రీధర్‌యాదవ్‌, శివరామకృష్ణ, శంకర్‌, రమేశ్‌గౌడ్‌, హమీద్‌, మధు, కొర్విరాములు, చింతల నర్సింహులు, యాదగిరిగౌడ్‌, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నర్సింహులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo