మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Feb 17, 2020 , 00:51:49

హరిత కానుక

హరిత కానుక

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకుని హరిత శుభాకాంక్షలు చెప్పడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకొని, జిల్లాలో రెండు లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంది. 469 గ్రామాలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో మొక్కలు నాటనున్నది.

  • విరివిరిగా నాటాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి పిలుపు
  • 469 గ్రామాల్లో, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో
  • రెండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
  • ప్రతి మున్సిపాలిటీలో 5వేల మొక్కలను నాటడమే లక్ష్యం
  • జిల్లా వ్యాప్తంగా గుంతలు తీసే పనులను ముమ్మరం
  • నేడు ఉద్యమంలా హరితహారం
  • నర్సరీల నుంచి మొక్కల పంపిణీ ప్రారంభం
  • పాల్గొనున్న ప్రజాప్రతినిధులు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకుని హరిత శుభాకాంక్షలు చెప్పడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకొని, జిల్లాలో రెండు లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంది. 469 గ్రామాలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో మొక్కలు నాటనున్నది. ఇప్పటికే గుంతలు తీసే పని పూర్తి చేసిన యంత్రాంగం, ఆయా నర్సరీల నుంచి మొక్కలను పంపిణీ చేసింది. కలెక్టర్‌ ధర్మారెడ్డి ప్రత్యేక చొరవతో అన్ని శాఖల అధికారులు ఇప్పటికే పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు లక్షల మొక్కలు జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెల్లడించారు.  ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్స్‌ పర్సన్‌, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా హరిత ఉద్యమంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.  


జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 469 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఏ గ్రామానికి ఏ నర్సరీ నుంచి మొక్కలను తరలించడంతో పాటు తదితర పనులను చేపట్టేందుకు అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. శనివారం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ, మున్సిపాలిటీల కమిషనర్ల ఆధ్వర్యంలో గుంతలు తీసే పనులు చేపట్టారు. జిల్లాలో వివిధ రకాల మొక్కలు నాటే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో గతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చనిపోయిన స్థానంలో నాటేందుకు నిర్ణయించినట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో చెప్పారు. రెండు లక్షల మొక్కలు జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్డుకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. ఆయా గ్రామాల్లోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, మహిళా సంఘాలు, స్థానిక అధికారులు సమన్వయంతో కలిసి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించనున్నారు.  


ప్రతి మున్సిపాలిటీలో ఐదు వేలు.. 

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుండగా, ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో 5వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్లు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో, ప్రభుత్వ భూముల్లో, రోడ్లకు ఇరువైపులా చైర్మన్ల్‌, కౌన్సిలర్లతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొని మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వనున్నారు. 


రెండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం..

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలో రెండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు, ఇతర కారణాలతో మొలకెత్తలేకపోయిన, చనిపోయిన,  నాటిన మొక్కలను గొర్రెలు, మేకలు మేసిన మొక్కల స్థానాలను గుర్తించి అదే స్థానంలో కొత్తగా 1.5లక్షల మొక్కలను నాటడానికి చర్యలు చేపట్టాం. మిగతా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయల ఆవరణలో, గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిల్లో కొత్తగా 50వేల మొక్కలు నాటడం జరుగుతుంది.  


logo