గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 17, 2020 , 00:49:26

గుబాళించిన గులాబీ

గుబాళించిన గులాబీ

జిల్లాలో సహకార సంఘాల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. 35 సహకార సంఘాలను చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. జిల్లాలో 37 సహకార సంఘాలు ఉండగా మెదక్‌ నియోజకవర్గం పాపన్నపేట సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో సహకార సంఘాల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. 35 సహకార సంఘాలను చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. జిల్లాలో 37 సహకార సంఘాలు ఉండగా మెదక్‌ నియోజకవర్గం పాపన్నపేట సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. అలాగే మూడు వైస్‌ చైర్మన్‌ పదవులకు జరుగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. నిజాంపేట, కొత్తపల్లి, కొల్చారం సహకార సంఘాలకు సంబంధించి వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 36 సహకార సంఘాలకు ఆదివారం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలు జరుగగా 35 సహకార సంఘాలు గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీకి ఒకే ఒక చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు దక్కాయి. నర్సాపూర్‌ నియోజకవర్గం కొల్చారం మండలం కిష్టాపూర్‌ సహకార సంఘం కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. రామాయంపేట మండలం కోనాపూర్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి భర్త ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా మూడవ సారి ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. జిల్లాలో 36 సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో 26 సహకార సంఘాలు ఏకగ్రీవం కాగా 10 సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. పాపన్నపేట సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అన్ని వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. పాపన్నపేట సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనున్నది. ఇదిలా వుండగా ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు డీసీవో పద్మ ఆధ్వర్యంలో సహకార సంఘాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికైన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ధృవీకరణ పత్రాలు అందించారు. త్వరలో జరిగే డీసీసీబీ ఎన్నికల్లో చైర్మన్‌లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చైర్మన్‌లకు గుర్తింపు కార్డులను డీసీవో పద్మ జారీ చేశారు.


 జిల్లాలో 36 సహకార సంఘాల  చైర్మన్లు, వైస్‌చైర్మన్ల వివరాలు logo