బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 17, 2020 , 00:37:15

సజావుగా ‘సహకార’ చైర్మన్‌ ఎన్నికలు

 సజావుగా  ‘సహకార’ చైర్మన్‌ ఎన్నికలు

మెదక్‌ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా చిలుముల హన్మంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కాస సూర్యతేజలు ఏన్నికయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సహకార సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారి అర్చన

మెదక్‌ ప్రాథమిక సహకార చైర్మన్‌గా హన్మంత్‌రెడ్డి 

వైస్‌ చైర్మన్‌గా సూర్యతేజ

మెదక్‌ రూరల్‌: మెదక్‌ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా చిలుముల హన్మంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కాస సూర్యతేజలు ఏన్నికయ్యారు. ఆదివారం ఉదయం  11 గంటలకు  సహకార సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారి అర్చన, మెదక్‌ ఎంపీడీవో సాయిబాబా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా ఏడో వార్డు అభ్యర్థి హన్మంత్‌రెడ్డి పేరును  రెండో వార్డు డైరెక్టర్‌ గందె రాములు ప్రతిపాదించగా నాలుగో వార్డు డైరెక్టర్‌ గోల్ల గట్టయ్య బలపర్చారు. వైస్‌ చైర్మన్‌గా సూర్యతేజను  12 వార్డు డైరెక్టర్‌ కసిరెడ్డి సిద్ధిరాంరెడ్డి ప్రతిపాదించగా ఆరో వార్డు డైరెక్టర్‌ పెంటయ్య బలపర్చారు.  పోటీలో ఎవరు లేక పోవడంతో చైర్మన్‌గా హన్మంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కాస సూర్యతేజ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  అధికారులు ప్రకటించారు. అనంతరం తొలి సమావేశాన్ని నిర్వహించారు.

నూతన పాలక వర్గాన్ని సన్మానించిన 

జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌, మున్సిపల్‌ చైర్మన్‌

నూతనంగా ఎన్నికైన సహకార సంఘం పాలకవర్గాన్ని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బట్టి జగపతి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు చింతల నర్సింహులు టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు వెంకట్‌రెడ్డి, యాదగిరిగౌడ్‌   ఘనంగా సన్మానించారు. 


కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా త్యార్ల రమేశ్‌

పాపన్నపేట: మండల పరిధిలోని మూడు సొసైటీలు ఉండగా కొత్తపల్లి చైర్మన్‌గా త్యార్ల రమేశ్‌ ఎన్నిక కాగా చీకోడ్‌ చైర్మన్‌గా దత్తరాజు ఎన్నికయ్యారు.  పాపన్నపేట చైర్మన్‌ స్థానానికి గడువులోపల ఎవరు నామినేషన్‌ వేయకపోవడంతో  చైర్మన్‌ ఎన్నికను రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు. చీకోడ్‌ సహకార సంఘం చైర్మన్‌గా దత్తరాజు గుప్తా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వైస్‌ చైర్మన్‌ పదవి కోసం కలాలి సావిత్రమ్మ పాతలింగాయపల్లి, రమణయ్య(చీకోడ్‌)లు నామినేషన్లు దాఖలు చేశారు. రమణయ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా కలాలి సావిత్రమ్మ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రశాంత్‌ వెల్లడించారు. కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్‌గా త్యార్లరమేశ్‌గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రతాప్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో 8మంది డైరెక్టర్‌లు పాల్గొననగా త్యార్లరమేశ్‌కు సత్యనారాయణ(కుర్తివాడ) ప్రపోజల్‌ చెయ్యగా, నాయికోటి కిష్టయ్య(మిన్పూర్‌) బలపరిచారు. దీంతో నామినేషన్‌ ఒక్కటి రావడంతో త్యార్ల రమేశ్‌గుప్తా ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 


టేక్మాల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా యశ్వంత్‌రెడ్డి

టేక్మాల్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ ఎన్నిక సజావుగా జరిగింది.  15వ తేదీన జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 8 మంది, కాంగ్రెస్‌ మద్దతుదారులు 5మంది డైరక్టర్లుగా ఎన్నికయ్యారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక కోసం ఆదివారం ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ కోసం నామినేషన్లు స్వీకరించారు. టీఆర్‌ఎస్‌ తరుఫున చైర్మన్‌గా యశ్వంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా వెంకయ్యలు నామినేషన్లు వేయగా, కాంగ్రెస్‌ మద్దతుదారులు ఛైర్మన్‌ కోసం నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కోసం పాపయ్యలు నామినేషన్‌ వేశారు. నామినేషన్లను విత్‌డ్రా చేసుకోకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో బ్యాలెట్‌తో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు ఓటింగ్‌ నిర్వహించారు. చైర్మన్‌గా పోటీ చేసిన యశ్వంత్‌రెడ్డికి 8ఓట్లు, నర్సింహారెడ్డికి 5 ఓట్లు రావడంతో యశ్వంత్‌రెడ్డి రెండోసారి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌కు సైతం వెంకయ్యకు 8ఓట్లు, పాపయ్య కు 5 ఓట్లు రావడంతో వెంకయ్య వైస్‌ చైర్మన్‌గా గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి విష్ణువర్ధన్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాన్ని ఎన్నిక ల అధికారి విష్ణువర్ధన్‌, సొసైటీ సీఈవో వేణుగోపాల్‌, బ్యాంకు మేనేజర్‌ రవీందర్‌లు అందజేశారు. 


అల్లాదుర్గం సొసైటీ చైర్మన్‌గా దుర్గారెడ్డి

అల్లాదుర్గం: అల్లాదుర్గం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీపై టీఆర్‌ఎస్‌ గులాబీ జెండాను ఎగురవేసింది. ఎన్నికల్లో 6 టీఆర్‌ఎస్‌, 5కాంగ్రెస్‌, ఇద్దరు రెబల్స్‌ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యాయి. దీంతో  టీఆర్‌ఎస్‌ రెబల్స్‌  మద్దతు ఇవ్వడంతో చైర్మన్‌గా దుర్గారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి విజయభాస్కర్‌ ప్రకటించారు. అనంతరం వారికి నియామక ధ్రువపత్రాలను అందజేశారు. 


రేగోడ్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా రాజుయాదవ్‌ 

రేగోడ్‌: రేగోడ్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా రాజుయాదవ్‌ (టీఆర్‌ఎస్‌) ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన చైర్మన్‌ ఎన్నికల్లో మండల పరిధిలోని కొత్వాన్‌పల్లి గ్రామానికి చెందిన రాజుయాదవ్‌ చైర్మన్‌గా ఎన్నిక కాగా రేగోడ్‌కు చెందిన నాలచెర్వువు రాధాకిషన్‌ వైస్‌ చైర్మన్‌గా (టీఆర్‌ఎస్‌) ఎన్నిక కావడంతో స్థానికంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. సంబురాల్లో జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు రమేశ్‌, మాజీ డైరెక్టర్‌ శ్రీను, నాయకులు భూంరెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


పెద్దశంకరంపేట పీఎసీఎస్‌ చైర్మన్‌గా సిద్ధ సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట ప్రాథమిక సహకార సంఘాన్ని టీఆర్‌ఎస్‌ తొలిసారి దక్కించుకుంది. పేట పీఎసీఎస్‌లో 13 స్థానాలకు 13 స్థానాలుటీ ఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకొని ప్రభంజనం సృస్టించింది. ఆదివారం స్థానిక పీఎసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ పదవికి చీలపల్లి 3వ టీసీకి చెందిన సిద్ధ సంజీవరెడ్డి ఎన్నికల అధికారి బన్సీలాల్‌కు నామినేషన్‌ అందజేశారు.  అతన్ని పీఎసీఎస్‌ డైరెక్టర్‌ లంబాడీ గోపాల్‌ ప్రతిపాదించగా భూత్కూరి సునీత బలపర్చారు. టెంకటి13వటీసీ కోనం సువర్ణ వైస్‌ చైర్మన్‌గా నామినేషన్‌ దాఖలు చేయగా డైరెక్టర్లు అశోక్‌ ప్రతిపాదించగా కంచరి మాణిక్యం బలపర్చారు.ఎవరు నామినేషన్లు దాఖలు చేయక పోవడంతో ఏకగ్రీవంగా చైర్మన్‌గా సిద్ధ సంజీవరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కోనం సువర్ణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లకు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగంశ్రీనివాస్‌, జెడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు, ఎంపీపీ ఉపాధ్యాక్షులు లక్ష్మీరమేశ్‌, మండలటీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆసూరి మురళీపంతులు, నాయకులు వేణుగోపాల్‌గౌడ్‌, సుభాశ్‌గౌడ్‌, దత్తు, మానిక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అమర్‌, సురేష్‌గౌడ్‌, అంజిరెడ్డి, రాజుగౌడ్‌, తదితరులున్నారు.


నాగాపూర్‌ సొసైటీ చైర్మన్‌ శ్రీహరి

హవేళిఘనపూర్‌: మండల పరిధిలోని నాగాపూర్‌, ఫరీద్‌పూర్‌ గ్రామాల్లో సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. మండల పరిధిలోని ఫరీద్‌పూర్‌ గ్రామంలో ఎన్నికల అధికారి సతీశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ తరపున జవాజీ బ్రహ్మం, ఉపాధ్యక్షుడిగా దాసరి సిద్ధిరాములు ఎన్నికయ్యారు.  నాగాపూర్‌  సహకార సంఘం చైర్మన్‌గా  శ్రీహరి, వైస్‌ చైర్మన్‌గా పురం శంకరయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల అధికారులు చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. నాగాపూర్‌, ఫరీద్‌పూర్‌   చైర్మన్లు ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సుజాత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు కసిరెడ్డి మాణిక్యరెడ్డి,  ఎంపీటీసీలు రాజయ్య, జ్యోతిసిద్ధిరెడ్డి అభినందనలు తెలిపారు.


logo