గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 16, 2020 , 00:20:50

తండాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

తండాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
  • సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
  • సేవాలాల్‌ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకులు

నర్సాపూర్‌,నమస్తే తెలంగాణ: తండాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని  నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం సేవాలాల్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌లు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మదన్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.55 కోట్లతో నర్సాపూర్‌ నియోజకవర్గంలోని తండాలకు అంతర్గత సీసీ రోడ్లతో పాటు డైనేజీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌లు గిరిజన సంప్రదాయ తలపాగ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణారెడ్డి, ఎఫ్‌సీఐ డీజీఎం ఛత్రూనాయక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నర్సాపూర్‌ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌, పెద్దచింతకుంట హెచ్‌ఎం గుండం మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ కవిత, ఎంపీపీ జ్యోతి, ఎంపీటీసీ సంధ్యారాణి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బాల్‌రెడ్డి, గిరిజన సంఘం నాయకులు సామ్యానాయక్‌, పెంట్యానాయక్‌, బుచ్చ్యనాయక్‌, ధన్‌సింగ్‌, రామచందర్‌, అమర్‌సింగ్‌, తదితరులు ఉన్నారు.

బోనాల ఊరేగింపు నిర్వహించిన గిరిజనులు  

రామాయంపేట: మున్సిపల్‌ పరిధిలోని కోమటిపల్లి తండాలో సేవాలాల్‌ జయంతి శనివారం ఘనంగా జరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌కు బోనాలతో అభిషేకాలు నిర్వహించారు. 

సేవాలాల్‌ గుడి నిర్మాణానికి సహకరిస్తా: చైర్మన్‌  

గిరిపుత్రుల ఆరాధ్య దైవమైన సేవాలాల్‌ గుడికి తనవంతు సహాయం చేస్తానని రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ అన్నారు.  చైర్మన్‌ వెంట కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, సుందర్‌సింగ్‌, డైరెక్టర్‌ బాదె చంద్రం, సిద్ధరాంరెడ్డి తదితరులు ఉన్నారు.


logo
>>>>>>