బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 16, 2020 , 00:19:46

జోష్‌.. మస్తీ

జోష్‌.. మస్తీ
  • రెండో రోజు హుషారుగా ఎలాన్‌ వేడుకలు
  • అదరగొట్టిన డీజే నైట్‌
  • కీర్‌ ఐఐటీహెచ్‌ పేరిట ఈ బులిటన్‌ ప్రారంభం

కంది నమస్తే తెలంగాణ: ఐఐటీ హైదరాబాద్‌ క్యాం పస్‌లో ఎలాన్‌ వేడుకలు రెండో రోజు హుషారుగా సాగాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాలపై ఆటల పోటీలను నిర్వహించి బహుమతులు, నగదు పురస్కరాలు అందజేశారు. ఉదయం ఐఐటీ క్యాంపస్‌ అకాడమిక్‌ ఆడిటోరియంలో కామెడీ క్లాబ్‌ పేరిట హాస్య పోటీలను నిర్వహించారు. అలాగే, డ్యాషింగ్‌ బాల్‌, ఎలక్ట్రిక్‌ రోబోటిక్‌ వెహికిల్‌, ఇతర విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. 

ఈ బులిటన్‌ ప్రారంభం...

కీర్‌ ఐఐటీహెచ్‌ పేరిట ఈ బులిటన్‌ను శనివారం ప్రారంభించారు. బీవోజీ చైర్మన్‌ బీవీ  మోహన్‌రెడ్డి, ఐఐటీ డైరెక్టర్‌ బీఎస్‌. మూర్తితో హాజరై  కలిసి ఈ బులిటన్‌కు సంబంధించిన న్యూస్‌ లెటర్‌ను విడుదల చేశారు. అలాగే, కీర్‌ ఐఐటీహెచ్‌ న్యూస్‌ లెటర్‌ను రూపొందించిన ఐఐటీ విద్యార్థి కార్తీక్‌కు హ్యాకాథన్‌ పోటీల్లో భాగంగా రూ.50వేల చెక్కును అందజేశారు. 

హుషారెత్తించిన డీజే నైట్‌..

రెండో రోజు రాత్రి ప్రముఖ డీజే బ్యాండ్‌ దర్శన్‌ రావల్‌ బృందం తమ జోష్‌పూల్‌ పాటలతో  హుషారెత్తించారు. వేడుకల్లో క్యాంపస్‌ విద్యార్థులతో పాటు ఇతర కళాశాల విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.


logo
>>>>>>