మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 16, 2020 , 00:19:15

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
  • జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌

మనోహరాబాద్‌: గ్రామాలాభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్‌ కొత్త పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించారని జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలంలోని కొత్త పంచాయతీలైన చెట్లగౌరారం, వెంకటాపూర్‌ అగ్రహారం, దండుపల్లి, కొండాపూర్‌, పాలాట గ్రామ పంచాయతీలకు గడ నిధుల నుంచి ప్రతి పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున మంజూరైన ప్రొసిడింగ్‌ కాపీలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కొత్త పంచాయతీల్లో నెలకొన్న పలు సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటైన పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యాత్మకంగా ఉన్న పనులను పూర్తి చేయాలని సూచించారు. దేశ చరిత్రలోనే  మారుమూల గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు  మదిర, తండాలను కొత్త పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో సొంత పాలన జరుగడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్నారు.

ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఇతరత్రా పక్కా భవనాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కొత్త పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలుగా ప్రతి గ్రామంలో సామూహికంగా మొక్కలను నాటి కానుకగా ఇవ్వాలన్నారు. ఇందు కోసం ఆయా పంచాయతీలకు అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. సోమవారం ప్రతి ప్రజాప్రతినిధి, నాయకులు, అధికారులు, కార్యకర్తలు హరితహారంలో పాల్గొని మొక్కలను నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్‌, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు చింతల మమతరవి, రేణుక, లక్ష్మీ,  స్వరూప నర్సయ్య, నాగభూషణం, ఉప సర్పంచులు మహేందర్‌గౌడ్‌, శ్రీహరిగౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు శేఖర్‌గౌడ్‌, నాయకుడు పంజా భిక్షపతి ముదిరాజ్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>