బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 15, 2020 , 00:00:06

ఎన్నికలకు ప్రజలు సహకరించాలి

ఎన్నికలకు ప్రజలు సహకరించాలి
  • మెదక్‌ జిల్లాలో 244 డైరెక్టర్‌ స్థానాలు..
  • మెదక్‌ ఎస్పీ, సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ చందనదీప్తి
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్టమైన నిఘా
  • సంగారెడ్డి జిల్లాలో 407 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు

మెదక్‌, నమస్తే తెలంగాణ : శనివారం జరిగే సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని మెదక్‌ జిల్లా ఎస్పీ, సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ చందనదీప్తి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 244 డైరెక్టర్‌ స్థానాలకు, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 407 డైరెక్టర్‌ స్థానాలకు జరుగబోయే ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పోలింగ్‌ కేంద్రాల్లో 21 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు, 11 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో 44 పోలింగ్‌ కేంద్రాల్లో అన్నీ సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించినట్టు తెలిపారు.  ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు శాఖ బందోబస్తు పాటు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఎన్నికల సమయంలో గొడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరైనా పాల్పడితే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.


అలాగే ప్రణాళికతో కూడినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు అధునాతనమైన ట్యాబ్‌లో ఫొటోలు చిత్రీకరించి అధికారులు పోలీసు సిబ్బంది కలిసి జియో ట్యాగింగ్‌ పూర్తి చేశారని, దీని వల్ల పోలింగ్‌ కేంద్రంలో ఏదైనా ఘటన జరిగితే సత్వరమే పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకొని తగు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున ఎవరైనా ఎన్నికల కోడ్‌కి విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తే వారిపైన ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు పోలీసు శాఖ అన్ని విధాలా ఏర్పాట్లు చేసిందని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవడం లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే ఎవరైనా రాజకీయ పార్టీల వారు డబ్బు, మద్యం పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. 

మెదక్‌ జిల్లా పోలీసు వాట్సాప్‌ నంబర్లు

7330671990, మెదక్‌ డీఎస్పీ 9490617007, తూప్రాన్‌ డీఎస్పీ 9490617008, మెదక్‌ టౌన్‌ ఎస్‌హెచ్‌వో 9490617045, మెదక్‌ రూరల్‌ సీఐ 9490617015, రామాయంపేట సీఐ 9490617018, డయల్‌ 100 లేదా మెదక్‌ జిల్లా పోలీస్‌ కంట్రోల్‌రూం ఫోన్‌ నంబర్‌ 08452223533, 08452221667లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తప్పు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పోలీసు వాట్సాప్‌ నంబర్లు..

9490617000 లేదా సంగారెడ్డి డీఎస్పీ 9490617005, పటాన్‌చెరు డీఎస్పీ 9490617006, నారాయణఖేడ్‌ డీఎస్పీ 8333998694, జహీరాబాద్‌ డీఎస్పీ 9490617030, డయల్‌ 100 లేదా సంగారెడ్డి జిల్లా పోలీసు కంట్రోల్‌ రూం ఫోన్‌ నంబర్లు 94440901835లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తప్పు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

మెదక్‌ జిల్లాలో బందోబస్తు సిబ్బంది వివరాలు 

ఎస్పీ, అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 40 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 150 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది హోంగార్డులు, 20 మంది ఏఆర్‌ ఫోర్స్‌తో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 

సంగారెడ్డి జిల్లా లో..

జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలు, 44 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 213 కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, 41 మంది హోంగార్డులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


logo
>>>>>>