శనివారం 28 మార్చి 2020
Medak - Feb 14, 2020 , 00:04:10

ప్రతి రైతుకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌

ప్రతి రైతుకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌

రామాయంపేట: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు వద్ద పీఎం కిసాన్‌ సమ్మాన్‌ క్రెడిట్‌ కార్డు ఉండే విధంగా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశురాంనాయక్‌ అన్నారు. గురువారం రామాయంపేటకు విచ్చేసిన అధికారి వ్యవసాయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టా పాసుబుక్కు ఉన్న రైతులందరూ కిసాన్‌ సమ్మాన్‌ కార్డు పొందాలని అన్నారు. అందుకు వ్యవసాయశాఖ ద్వారా ఆన్‌లైన్‌లో కార్డు పొందాలన్నారు. రైతులందరు జిల్లాలో ఉన్న మండల కేంద్రాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులను నేరుగా సంప్రదించాలన్నారు. పట్టా పాసుబుక్కు జిరాక్స్‌, ఆధార్‌కార్డు జిరాక్సుతో సంబంధిత కార్యాలయంలో కలువాలన్నారు.  లక్షా 35వేల మంది కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకు అర్హులైన రైతులు ఉన్నారన్నారు. యాసంగిలో రైతులకు సరిపడా ఎరువులు 7వేల మెట్రిక్‌ టన్నులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎరువులను సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి అందజేస్తామన్నారు. చీడపీడల నివారణకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రామాయంపేట వ్యవసాయ శాఖ అధికారి వసంత సుగుణ, ఏవో.రాజ్‌నారాయణ, యాదగిరి, ఏఈవోలు నరేందర్‌, సాయికృష్ణ ఉన్నారు.


logo