శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 12, 2020 , 01:17:45

విద్యార్థుల లక్ష్యసాధన కోసం కృషిచేయాలి

విద్యార్థుల లక్ష్యసాధన కోసం కృషిచేయాలి

తూప్రాన్‌ రూరల్‌: ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా విని ఆచరించడం ద్వారానే జీవితంలో విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని డీఈవో రమేశ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం తూప్రాన్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్‌జీవో నాన్‌గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో 350 మంది విద్యార్థులకు డిక్షనరీలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దాతలు అందించిన  సహకారంతో పేద విద్యార్థులు తమ భవిష్యత్‌ను రూపుదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, హెచ్‌ఎం అరుణజ్యోతి, ఉపాధ్యాయులు రమేశ్‌గంగాల, వసంతదేవి, మధుసూదన్‌ ,సాయిరెడ్డి, చంద్రారెడ్డి, దుర్గారెడ్డి, ప్రసన్నవదన, వెంకట్రామ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వేణుగోపాల్‌గౌడ్‌, నట్రాజ్‌, ఝాన్సీరాణి, చంద్రరావు, సురేశ్‌లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


పదిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి

చేగుంట: ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌ పేర్కొన్నారు. నార్సింగి జిల్లా పరిషత్‌ పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల ప్రతిభను తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేశ్‌ మాట్లాడుతూ రానున్న పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జ్ఞానమాల, ఉపాధ్యాయులు ఉన్నారు. 


logo