సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 12, 2020 , 00:36:40

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం కాపాడిన పోలీసులు

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం కాపాడిన పోలీసులు

రామాయంపేట: యజమాని తన నెలజీతం ఇవ్వలేదని ఓ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన రామాయంపేట బైపాస్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే రామాయంపేట మున్సిపల్‌ పరిధిలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన అనిల్‌ కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని ఓ లారీ యజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అనిల్‌కు వచ్చే జీతాన్ని యజమాని ఇవ్వకపోవడంతో మనస్తాపంతో అనిల్‌ బిక్కనూరు నుంచి రా మాయంపేటకు చేరుకుని మార్గమధ్యంలోని ఓ చెట్టుకు తన షర్టుతో ఉరివేసుకోబోయ్యాడు. ఆ వైపునుంచి వెళ్తున్న కొంత మంది వ్యక్తులు 100కు డయల్‌ చేయగా అప్రమత్తమైన రామాయంపేట పోలీసులు రా జు, బాల్‌రాజుగౌడ్‌లు ఘటన వద్దకు నిమిషాల వ్యవధిలో చేరుకున్నా రు. అప్పటికే అతను ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. వెం టనే చెట్టు పైకి ఎక్కిన ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని క్రిం దకు దించి సపర్యలు చేసి నీరు తాగించారు. అనంతరం పేట ప్రభు త్వదవాఖానకు తరలించారు. డ్రైవర్‌ అనిల్‌ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం చేరవేశారు. కానిస్టేబుళ్లు వ్యక్తి ప్రాణాలు కాపాడడంతో స్థానికులు అభినందించారు. డ్రైవర్‌కు టుంబ సభ్యులు పోలీ సులకు కృతజ్ఞతలు తెలిపారు.


logo