శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 10, 2020 , 23:44:02

కన్నుల పండుగగా మల్లన్నస్వామి కల్యాణం

కన్నుల పండుగగా మల్లన్నస్వామి కల్యాణం

తూప్రాన్‌  రూరల్‌ : తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో సోమవారం మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ఫుడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్నస్వామి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. గ్రామ దేవతల ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించుకోవడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లంబ వెంకటమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు లంబ రమేశ్‌, హరీశ్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి పాల్గొన్నారు.


logo