బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 10, 2020 , 00:36:52

నామినేషన్లు.. 1,188 ఆమోదం

నామినేషన్లు.. 1,188 ఆమోదం
  • 52 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు

మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లా సహకార సంఘాల ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం జిల్లాలోని 37 సహకార సంఘాల్లో నామినేషన్ల పరిశీలన జరిగింది. మొత్తం 481 డైరెక్టర్‌ స్థానాలకు 1240 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో వివిధ కారణాలతో 52 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా కొందరైతే, మరికొందరు ప్రపోజర్‌ సంతకం లేకుండా నామినేషన్లు వేసినందుకు, ఇతర కారణాలతో 52 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరిగింది. రిటర్నింగ్‌ అధికారుల పర్యవేక్షణలో నామినేషన్లను పరిశీలించారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించి జాబితాను ప్రకటిస్తారు. అక్షర క్రమంలో అభ్యర్థి పేరు బ్యాలెట్‌ పేపర్లపై వారికి కేటాయించిన గుర్తులను ప్రకటించనున్నారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగనున్నది. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది. జిల్లా పరిధిలోని మొత్తం 37 సహకార సంఘాల్లో 54,401మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా వుండగా ఇప్పటికే జిల్లాలోని కోనాపూర్‌, వరిగుంతం, కొంగోడు సహకార సంఘాలు ఏకగ్రీవం కాగా 34 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 


logo
>>>>>>