శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 10, 2020 , 00:35:10

మోహన్‌రెడ్డికి ఉత్తమ మానవతావాది అవార్డు

మోహన్‌రెడ్డికి ఉత్తమ మానవతావాది అవార్డు

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ : మండల పరిధిలోని పెద్దచింతకుంట  ప్రభుత్వ హైస్కూల్స్‌  ప్రధానోపాధ్యాయుడు గుండం మోహన్‌రెడ్డికి ఉత్తమ మానవతావాది అవార్డు లభించింది. గ్రీన్‌ ఇండియా సొసైటీ సంస్థ ద్వితీయ వార్షికోత్సవం హైదరాబాద్‌ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో వివిధ కేటగిరీలలో అవార్డులను అందజేశారు. మాజీ ఎంపీ మంద జగన్నాథం, గ్రీన్‌ ఇండియా సొసైటీ చైర్మన్‌ జ్యోతిరెడ్డి చేతులమీదుగా  విద్యారంగంలో, సామాజిక రంగంలో, పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న  పెద్దచింతకుంట పాఠశాల  హెచ్‌ఎం  గుండం మోహన్‌రెడ్డికి ఉత్తమ మానవతావాది అవార్డును అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన  ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనకు  ఉత్తమ మానవతావాది అవార్డు దక్కడం సంతోషకరంగా ఉందని అన్నారు. అవార్డు పొందిన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.


logo