బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 09, 2020 , 23:59:01

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

అల్లాదుర్గం : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని పట్టుకొని సొత్తును రికవరీ చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు.ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని కాయిదంపల్లి గ్రామానికి చెందిన జీల సంగమేశ్‌ ఈ నెల 4న కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. ఇంటి పైనుంచి ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి 4తులాల బంగారు ఆభరణాలు, రూ.16వేల నగదును గుర్తుతెలియని వ్యక్తి దొంగలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపినట్లు తెలిపారు. అదే గ్రామానికి చెందిన జీల లక్ష్మయ్య సంగమేశ్‌ వద్ద పని చేస్తున్నాడు. తిరుపతి వెళ్లే సమయంలో లక్ష్మయ్యకు ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్తున్నాం ఇంటికి వైపు చూస్తూ ఉండు అని చెప్పాడు. ఈనెల 4న అర్థరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి బంగారం, నగదు అపహరించాడు. సీసీ కెమెరాల ఆధారంగా లక్ష్మయ్యను విచారించడంతో నేరం అంగీకరించినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 4తులాల బంగారు ఆభరణాలు రూ.16 వేలు రికవరీ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.


logo
>>>>>>