సోమవారం 30 మార్చి 2020
Medak - Feb 08, 2020 , 23:47:28

డీసీపీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

 డీసీపీలో  గులాబీ జెండా ఎగరడం ఖాయం
  • పార్టీ బలపర్చిన అభ్యర్థులదే గెలుపు
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
  • పట్టణ ప్రగతితో రామాయంపేట మరింత అభివృద్ధి
  • టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రుణాల మంజూరు
  • 105 సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే...
  • రైతాంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌
  • ప్రజలు, రైతుల రుణాన్ని తీర్చుకునేందుకే రామాయంపేటలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌
  • మార్చి, ఏప్రిల్‌లో 5 నియోజకవర్గాలకు భగీరథ నీరు

రామాయంపేట : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరోసారి సహకార ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే శారదరాజు కాంప్లెక్సులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలో రామయంపేట మండలం కోనాపూర్‌ సొసైటీని దేవేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఏకగ్రీవమైందని అన్నారు. దాంతో బాటు రామాయంపేట సొసైటీలో 2 ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని చోట్ల కూడా జిల్లాలో డైరెక్టర్‌ స్థానాలు కూడా ఏకగ్రీవం కాబోతున్నాయన్నారు. డీసీసీబీని కచ్చితంగా గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 105 సొసైటీలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. వరుస ఎన్నికలతో విజయాలను సొంతం చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రజల రుణాన్ని తీర్చుకుంటుందన్నారు. గత ఐదేండ్ల కాలంగా ఏ ప్రభుత్వం చేయని పనులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్నదన్నారు.  


ప్రజా అవసరాల కోసమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం..

ప్రజల అవసరాలను తీర్చడం కోసమే రామాయంపేట మున్సిపల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనానికి పనులను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. రామాయంపేట పట్టణ అభివృద్ధి టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రగతిలో రామాయంపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ సరాఫ్‌ యాదగిరి, మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌, ప్రభావతి, ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ పాతూరి ప్రభావతి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, మల్యాల కవిత, చిలుక గంగాధర్‌, సరాఫ్‌ సౌభాగ్య శ్యాం, దేవుని జయరాజు, బాదె చంద్రం, ఐలయ్య, లక్ష్మణ్‌ యాదవ్‌, కన్నపురం కృష్ణాగౌడ్‌, బాసం శ్రీనివాస్‌, తోట కిరణ్‌, నవీన్‌ తదితరులు ఉన్నారు.


logo