సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 08, 2020 , 23:44:02

జాతీయ లోక్‌అదాలత్‌లో 1839 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్‌లో 1839 కేసులు పరిష్కారం



సంగారెడ్డి టౌన్‌ : రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ జాతీయ లోక్‌అదాలత్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1839 కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఈ కేసులలో రూ.1,75,77,984లు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. 26 ఎంవీఓపీ కేసుల్లో రూ.1,61,76,000ల నష్టపరిహారం, 36 సివిల్‌ కేసులు, 843 క్రిమినల్‌ కేసులు, ల్యాండ్‌ అక్విజేషన్‌ కేసులో రూ.14,01,984ల నష్టపరిహారం ఇప్పించామని తెలిపారు. అదే విధంగా 933 ఫ్రీ లిటిగేషన్‌ కేసులను పరిష్కరించామన్నారు.  ఉమ్మడి కోర్టు భవనాల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో ఫస్టు అడిషనల్‌ జిల్లా జడ్జీ పాపిరెడ్డి, సెకెండ్‌ క్లాస్‌ అడిషనల్‌ జిల్లా జడ్జీ శ్యాంశ్రీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, సీనియర్‌ సివిల్‌ జడ్జీ పుష్పలత, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జీ కల్పన, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, నర్సింగ్‌రావు, పి పి శ్రీనివాస్‌, సి.విఠల్‌రెడ్డి, గౌతమి, పి.బాల్‌రెడ్డి, జె.శ్రీకాంత్‌, సాయికుమార్‌, జ్ఞానోభా, అడ్వకేట్లు, కక్షిదారులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. 


logo