గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 08, 2020 , 23:37:19

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే యాదవులకు మేలు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే యాదవులకు మేలు

వర్గల్‌ : సమాజంలో ఆర్థికంగా వెనకబడిన యాదవ, గొల్ల, కుర్మలకు బాసటగా నిలిచింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలో యదవసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణమండపాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సబ్సిడీపై గడ్డి విత్తనాలు, గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ ద్వారా గొర్లకాపరులు ఆర్థికంగా అభ్యున్నతి చెందారన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పుడు కేసీఆర్‌ పంపిణీ చేసిన గొర్రెలే కన్పిస్తున్నాయని తెలిపారు. యాదవుల సంఘటితానికి  వర్గల్‌ లో నిర్మించిన కల్యాణమండపమే నిదర్శనమన్నారు. ఎంపీ నిధుల ద్వారా ప్రహరీ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజరాధాకృష్ణశర్మ, నర్సాపూర్‌ మున్సిపాల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, గొర్రెల కాపరుల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు  రాజయ్యయాదవ్‌, శ్రీహరియాదవ్‌, రవిందర్‌యాదవ్‌, ఐలయ్యయాదవ్‌, కుమార్‌యాదవ్‌, వర్గల్‌ జెడ్పీటీసీ, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బాలమల్లుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు మల్లెల జహంగీర్‌యాదవ్‌లు పాల్గొన్నారు.


logo
>>>>>>