సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 08, 2020 , 02:17:58

రెండోరోజు 416 నామినేషన్ల దాఖలు

రెండోరోజు 416 నామినేషన్ల దాఖలు
  • మెదక్‌ పీఏసీఎస్‌లో అత్యధికంగా 27 దాఖలు
  • చందంపేటలో అత్యల్పంగా 5 నామినేషన్లు
  • మాచవరం, చీకోడ్‌ పీఏసీఎస్‌లలో నామినేషన్లు నిల్‌

మెదక్‌, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల హడావుడి కొనసాగుతున్నది. రెండో రోజు కూడా పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో శుక్రవారం 416 నామినేషన్‌లు దాఖలయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నామినేషన్‌ పత్రాల్లో తప్పులు దొర్లకుండా ఎన్నికల అధికారులు అభ్యర్థ్ధులకు తగిన సూచనలు చేస్తున్నారు. రెండో రోజు జిల్లా వ్యాప్తంగా 50 వరకు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

మండలాల వారీగా నామినేషన్లు ...

జిల్లాలో అత్యధికంగా మెదక్‌ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో 27 నామినేషన్లు దాఖలు కాగా, చందంపేట పీఏసీఎస్‌లో  కేవలం 5 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.  ఇక ప్రధాన ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలైన మెదక్‌ మండలం మాచవరంలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో 13, పాపన్నపేట మండలం కొత్తపల్లిలో 14, కొల్చారం మండలం రంగంపేట్‌లో 7, రెడ్డిపల్లిలో 15, నర్సాపూర్‌లో 9, నాగాపూర్‌ పీఎసీఎస్‌లో 13,  పాపన్నపేటలో 9, టేక్మాల్‌లో 24, నిజాంపేటలో 13, మహ్మద్‌నగర్‌లో 15, శివ్వంపేటలో 19, కొల్చారంలో 6, రేగోడ్‌లో 17, పెద్దశంకరంపేటలో 7, అల్లాదుర్గం 15, కల్వకుంటలో 13, కోనాపూర్‌ 13, రామాయంపేటలో 16, జంగరాయి 8, మడూరు 16, చిన్నశంకరంపేటలో 9, ఫరీద్‌పూర్‌లో 13 నామినేషన్లు దాఖలయ్యాయి.

 పోలీసు బందోబస్తు..

జిల్లాలోని 37 ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ  ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థితో పాటు ఒక ప్రతిపాదకుడిని, మరొకరిని మాత్రమే ఎన్నికల అధికారి దగ్గరకు పంపుతున్నారు.  


logo