మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 08, 2020 , 02:04:42

తూప్రాన్‌ పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉండాలి

తూప్రాన్‌ పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉండాలి
  • గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌

తూప్రాన్‌రూరల్‌: ప్రజలకు నష్టం కలిగించే చర్యలు తాము తీసుకోమని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నదాల శ్రీనివాస్‌ అన్నారు. తూప్రాన్‌ పట్టణాభివృద్ధికి ప్రజలు, వర్తక, వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజలు నహకరించాలని వారు కోరారు. తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపన్‌పల్లి, ఆబోతుపల్లిలో శుక్రవారం చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కౌన్సిలర్‌లతో కలిసి గడ ప్రత్యేకాధకారి ముత్యంరెడ్డి పర్యటించారు. పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల నుంచి సమస్యలు వారు అడిగి తెలుసుకున్నారు. తూప్రాన్‌ పట్టణం విస్తరణ కావాల్సి ఉందన్నారు. తూప్రాన్‌ ప్రధాన రహదారి ఇరువైపులా కలిపి 100 ఫీట్లు, పట్టణంలోని పలు వీధుల్లో 30 ఫీట్లు వెడల్పు కావాల్సి ఉందన్నారు. వార్డుల వారీగా ప్రజల అభీష్టం మేరకే రోడ్డు విస్తరణ చేపడుతామన్నారు. తూప్రాన్‌ మున్సిపాటిలిటీలో పలు వీధులను 30 ఫీట్లవంతున రోడ్డును విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్‌, ఏర్పుల ఉమాసత్యలింగం, మామిండ్ల జ్యోతికృష్ణ, జమాల్‌పూర్‌ లక్ష్మీబాయి, టీఆర్‌ఎస్‌ నాయకులు చెలిమెల రఘుపతి, కుమ్మరి రమేశ్‌, అజార్‌,  కోరబోయిన ప్రవీణ్‌కుమార్‌ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>