శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 08, 2020 , 02:04:42

జైన దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

జైన దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

కొల్చారం :కొల్చారంలోని జైన దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, దేవాలయ ఆవరణలో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కొల్చారంలోని జైన దేవాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జైన ప్రతినిధులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోనే  పార్శనాథుడి దేవాలయాన్ని పర్యాటకంగా గుర్తించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆలయ ఆవరణలో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జైనప్రతినిధులు సుమేర్‌చంద్‌ పాండియా, రాజేశ్‌ పహడియా, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్‌, సర్పంచ్‌ కరెంటు ఉమా రాజాగౌడ్‌, ఎంపీటీసీ అరుణ కృష్ణాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గౌరీశంకర్‌, ఆయా గ్రామాల సర్పంచులు మన్నె శ్రీనివాస్‌, నాగరాణి నర్సింహులు, చలం ఝాన్సీలక్ష్మి యాదగిరి, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు కరెంటు రాజాగౌడ్‌, ఆది నాగేశ్వర్‌రావు, విజయ్‌,  రైతు సమితి కో-ఆర్డినేటర్‌ గ్యాస్‌ కృష్ణ, ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ గౌరీశంకర్‌, మాజీ అధ్యక్షుడు దేవన్నగారి శేఖర్‌, చింతల యాదగిరి, డీసీఎంఎస్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మన్నె రాములు తదితరులు పాల్గొన్నారు. 


logo