శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 07, 2020 , 00:21:06

తొలి రోజు 39 నామినేషన్లు

తొలి రోజు 39 నామినేషన్లు

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :సహకార సంఘాల ఎన్నికలకు గురువారం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ఘట్టం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో 37 సహకార సంఘాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి రోజు గురువారం 37 సహకార సంఘాలకు 15 సహకార సంఘాల్లో 39 నామినేషన్లు దాఖలయ్యాయి. 22 సహకార సంఘాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియను డిప్యూటీ రిజిస్ట్రారు వేణుగోపాల్‌శర్మ జిల్లాలోని పలు సహకార సంఘాలకు చేరుకుని పరిశీలించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకే నామినేషన్ల దాఖలుకు సమయం కేటాయించడంతో పలువురు నామినేషన్ల దాఖలు చేసేందుకు పోటీ పడ్డారు. ఇంకా నామినేషన్ల సమయం 7,8 తేదీల్లో నామినేషన్ల స్వీకరించేందుకు గడువు ఉంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కావడంతో సహకార సంఘాల వద్ద అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు హడావుడి మొదలైంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి ఎన్నికల అధికారులతో పాటు సొసైటీ సిబ్బంది సహకరిస్తున్నారు. జిల్లాలోని 37 సహకార సంఘాల్లో 481 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే 37 సహకార సంఘాల పరిధిలోని సొసైటీ కార్యాలయాల్లోనే నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

7, 8 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ..

జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ 

సహకార సంఘాల్లో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రత్యేకంగా ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. వారి ఆధ్వర్యంలోనే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 8వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది. 9న నామినేషన్ల పరిశీలన చేపడుతారు. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు చేపడుతారు. జిల్లా పరిధిలో 37 సహకార సంఘాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 54,401 మంది ఓటర్లు ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగనున్నాయి.

సహకార సంఘాల వద్ద వివిధ పార్టీల నాయకుల హడావిడి..

జిల్లాలోని 37 సహకార సంఘాల వద్ద వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు హడావిడి మొదలైంది. జిల్లాలో తొలిరోజు 37 సహకార సంఘాలకు 15 సహకార సంఘాల్లో 39నామినేషన్లు దాఖలయ్యాయి. 22 సహకార సంఘాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు రోజుల సమయం ఉండటంతో ఆశావహులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా కో-ఆపరేటీవ్ డిప్యూటీ రిజిస్ట్రారు వేణుగోపాల్ శర్మ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. 


logo