బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 07, 2020 , T01:25

చిన్నారుల మిస్సింగ్‌పై.. విచారణ ముమ్మరం

చిన్నారుల మిస్సింగ్‌పై.. విచారణ ముమ్మరం

తూప్రాన్‌రూరల్ : తూప్రాన్ పట్టణంలో నలుగురు పిల్లల అదృశ్యం ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తన భర్త స్నేహితులే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నలుగురి పిల్లలను నమ్మించి తీసుకెళ్లినట్లు భార్య నస్రీం చెబుతుండటం గమనార్హం. కన్పించకుండా పోయిన పిల్లల కోసం తూప్రాన్ పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రాజస్తాన్‌లోని ఇండోర్‌కు చెందిన జాకీర్‌తో నస్రీంకు వివాహం కాగా.. నస్రీంకు షాకీర్ (10), సాబేర్ (9), నజ్రీన్ (7), సమీర్ (6) జన్మించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శివారులోని ఓ సీడ్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషికుంటుంది. బుధవారం బాధితురాలు నస్రీం సీడ్స్ కంపెనీకి వెళ్లింది. విషయం తెలుసుకున్న నస్రీం భర్త జాకీర్ తన స్నేహితులను తూప్రాన్‌కు రప్పించి వారి పిల్లలకు మాయమాటతో మభ్యపెట్టి వారిని రాజస్తాన్‌కు తరలించినట్లు ఆమె ఆరోపించారు. 


logo
>>>>>>