సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 05, 2020 , 00:57:58

గజ్వేల్‌లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌

గజ్వేల్‌లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : గజ్వేల్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ పరంగా ఈ సెంటర్‌లో అనేక రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి రిపోర్టులు ఇస్తారు. గజ్వేల్‌ దవాఖాన పరిధిలో అన్ని ప్రభుత్వ దవాఖానలకు వైద్యం కోసం వచ్చిన రోగులకు ఈ సౌకర్యం సమకూరనుంది. గజ్వేల్‌ దవాఖానాను రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రభుత్వ దవాఖానగా మార్చడానికి సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టగా తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు  స్థానికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ సెంటర్‌ ఏర్పాటు కోసం మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌ అనుమతి లభించినట్లు తెలుస్తుండగా త్వరలో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖాన ఆధునికీకరణ తర్వాత అనేక రకాలుగా ప్రత్యేకతను చాటుకుంటుంది. మంగళవారం కిడ్నీలలో రాళ్లను తొలగించి జిల్లాస్థాయిలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రూపాయి ఖర్చు లేకుండా శంకరమ్మ అనే రోగికి కిడ్నీ బ్లాడర్‌లో రాళ్లను తొలగించి అద్భుతమైన చికిత్స చేయడం గమనార్హం. కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌తో పాటు స్టెమి కార్నర్‌ విభాగం లాంటి అత్యవసర చికిత్స విభాగాలెన్నో గజ్వేల్‌లో అందుబాటులో ఉన్నాయి. గజ్వేల్‌లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల పరీక్షలకు సంబంధించిన మరిన్ని సౌకర్యాలు రోగులకు అందుబాటులోకి వస్తాయి. పరీక్షలకు  సంబంధించిన అత్యాధునిక పరికరాలు, యం త్రాలు, కిట్లు, వైద్యులు, సిబ్బంది త్వరలో గజ్వేల్‌ దవాఖానలో అందుబాటులోకి రానుంది. గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులు పొందినట్లు సమాచారం.

పలు అంశాల్లో ఆదర్శ సేవాలు...

గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానలో అనేక రకాల సేవలు ఆదర్శంగా నిలిచాయి. ప్రసూతీల్లో గజ్వేల్‌ కొత్త రికార్డును సృష్టిస్తుంది. జనవరిలో 287 ప్రసూతీలు కాగా 172 నార్మల్‌ ప్రసూతీలు అయ్యాయి. దీనితో పేదలతోపాటు ధనవంతులు కూడా కార్పొరేట్‌ దవాఖాలకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానకు వెళ్తున్నారు. క్యాన్సర్‌, పక్షవాతం లాంటి వ్యాధులకు సంబంధించిన చికిత్స అత్యాధునిక పద్ధతుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఫిజియోతెరపీ లాంటి చికిత్సను కూడా గజ్వేల్‌ దవాఖానలో అందించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. మర్కూక్‌ మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి నడుమునొప్పికి సంబంధించిన చికిత్స గజ్వేల్‌ దవాఖానలో జరుగాగ అనేక రోజులుగా బాధపడుతున్న ఇబ్బంది నయమైందని సదరు రోగి పేర్కొన్నారు. 

సిబ్బంది పెంపుపై దృష్టి...

గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది అవసరం మేరకు నియమాకంపై చర్యలు చేపట్టారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు డిప్యూటెషన్‌పై వెళ్లిన ఉద్యోగులనందరిని వెనక్కి రావాలని సూ చనలు చేశారు. ఇప్పటికే కొంత మంది వైద్యులు, ఏఎన్‌ఏంఐలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తద్వారా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సేవలు మరింత మెరగైయ్యాయి. 

 డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు స్థానికులకు వరం

గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల పేద రోగులకు ఎం తో మేలు జరుగుతుంది. పరీక్షల నిమిత్తం పెద్ద మొత్తంలో ఖ ర్చులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానకు చికిత్స కోసం వచ్చిన వా రికి అవసరమైన  పరీక్షలు ఇక నుం ఉచితంగా జరుగుతాయి.వైద్యం చేయడం సులువు కావడంతో రోగికి మేలు జరగడంతోపాటు వైద్యులకు సౌకర్యావంతంగా మారుతుంది.                               -ముత్యం రెడ్డి గడా ఓఎస్డీ


logo