గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 05, 2020 , 00:52:18

ఎల్‌వోసీ చెక్కులు అందజేత

ఎల్‌వోసీ చెక్కులు అందజేత

అల్లాదుర్గం :నిరుపేదలకు వరం ‘సీఎం సహాయనిధి’ అని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న పేదవారికి నేనున్నానంటూ ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా వైద్య ఖర్చులు చెల్లిస్తున్నదన్నారు. అలాగే ముందుగా దవాఖాన ఖర్చులు చెల్లించుకోలేని వారికి ఎల్‌వోసీ అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనీల్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్‌, సర్పంచులు అంజియాదవ్‌, సుభాష్‌, ఎంపీటీసీ దశరథ, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు వరప్రసాద్‌, జాగృతి జిల్లా నాయకుడు కృష్ణాగౌడ్‌, మాజీ సర్పంచ్‌ నర్సింహులు, ప్రభు, నర్సప్ప, రమేశ్‌ పాల్గొన్నారు.

టేక్మాలో..

టేక్మాల్‌ :  అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి  చెక్కులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అందజేశారు. టేక్మాల్‌ మండల పరిధిలోని కోరంపల్లి గ్రామానికి చెందిన కొండయ్యకు రూ.27వేలు, కుసంగికి చెందిన శేషమ్మ రూ.18వేలు, ధనూర గ్రామం నర్సింహులు రూ.12వేలు, అచ్చన్నపల్లికి చెందిన సాయిలుకు రూ.14వేలు సీఎం  సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరప్ప, ఆరీఫ్‌, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యుడు యూసూఫ్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు విక్రం గౌడ్‌, రాజు తదితరులు ఉన్నారు.


logo