బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 05, 2020 , 00:52:18

ప్రైవేట్‌ వ్యక్తులకు పాలు అమ్మి నష్టపోవద్దు

ప్రైవేట్‌ వ్యక్తులకు పాలు అమ్మి నష్టపోవద్దు

కొల్చారం : పాడి రైతులు ప్రైవేట్‌ వ్యక్తులకు పాలు అమ్మి నష్టపోవద్దని జిల్లా పశువైద్యాధికారి అశోక్‌ కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని రాంపూర్‌లో మంగళవారం ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మరియు ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఆనిమల్‌ ప్రొడక్టివిటి హెల్త్‌  కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాధికారి సిబ్బంది పనితీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పశువుకు 4 నెలల పై బడిన వాటికి తప్పకుండా టీకాలు వేయించుకోవాలని తెలిపారు.  ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాంపూర్‌లో మంగళవారం నిర్వహించిన గాలికుంటు నివారణ శిబిరంలో 226 పశువులకు టీకాలు, చెవిపోగులను వేశామన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్‌ గట్టయ్య, సిబ్బంది సిద్ధమ్మ మైపాల్‌, గోపాలమిత్రలు జి.ప్రవీణ్‌, ఎం.శ్రీకాంత్‌, పశుమిత్ర టి.మమత, రైతులు పాల్గొన్నారు.  


logo
>>>>>>