శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 05, 2020 , 00:48:35

అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను సాధించాలి

అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను సాధించాలి

నర్సాపూర్‌ రూరల్‌: కందకాల లాంటి అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను సాధించాలని డాక్టర్‌ కాపర్‌ సంస్థ వ్యవస్థాపకులు, ఎంఎస్‌ఆర్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా.ఎం మల్లారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కాగజ్‌మద్దూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వారం వారం-కేరీర్‌ అవకాశాల మణిహారం అనే పేరిట జరుగుతున్న కేరీర్‌ గైడెన్స్‌ తరగతులకు మంగళవారం మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యావకాశాలను సద్వినియోగపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజూ దినపత్రికలు చదువుతూ సమకాలిన అంశాలపై అవగాహన పెంచుకోవాలని వెల్లడించారు. అపోలో మెడిస్కిల్స్‌ ప్రతినిధి ఎస్‌.రాంమోహన్‌ రాజు మాట్లాడుతూ ఉన్నత విద్యకు అవరోధంగా ఉండే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు స్కాలర్‌షిప్‌ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించా రు.కార్యక్రమంలో కేరీర్‌ గైడె న్స్‌ నిపుణుడు డా.ఆర్‌. సూ ర్యప్రకాశ్‌రావు,ఉపాధ్యాయులు మహేందర్‌రెడ్డి, సు నీల్‌,సుభాస్కర్‌, చరణ్‌సిం గ్‌, రాములు, నర్సింహులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo