సోమవారం 30 మార్చి 2020
Medak - Feb 03, 2020 , 23:35:05

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

నిజాంపేట: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కష్టపడి చదవాలని మెదక్‌ జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం నిజాంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో రమేశ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో డీఈవో మాట్లాడుతూ రానున్న వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని  అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశాంతమైన వాతవరణంలో చదువుకోవాలని అన్నారు. బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటేను నేర్చుకోవాలని సూచించారు. త్వరలోనే పాఠశాలకు డిక్షినరీలను పంపిణీ చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు విజయకుమార్‌, సురేశ్‌, మల్లేశం, జయకృష్ణ, వినయ్‌, రాధిక, నర్సమ్మ, కవిత, రోజా ఉన్నారు.


logo