శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 02, 2020 , 23:49:41

మూడోరోజు జాతరకు పోటెత్తిన భక్తులు

మూడోరోజు జాతరకు పోటెత్తిన భక్తులు

రామాయంపేట / నిజాంపేట :నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ తిరుమలనాథ స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. మూడోరోజు ఆదివారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని తిరుమలనాథ స్వామిని దర్శించుకున్నారు. నిర్వాహకులు దేవాలయ కమిటీ చైర్మన్‌ ఆకుల మహేందర్‌, సర్పంచ్‌ నర్సింహారెడ్డి పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి గరుడసేవ, స్వామి రథన్ని ఊరేగించారు. వేదబ్రాహ్మణులు వాసుదేవచారి, వెంకట రాంమోహనశర్మ, రాఘవాచారిలు స్వామి వారికి మంగళహారతులు, నైవేద్యాలను సమర్పించారు. తిరుమలనాథ స్వామి రథాన్ని నిర్వాహకులు చైర్మన్‌ మహేందర్‌, పాలకవర్గం సభ్యులు ఊరేగింపు నిర్వహించారు. జాతరలో చిన్నారులు, పెద్దలు జాతరలో సంతోషంగా గడిపారు. జాతరలో వెలిసిన దుకాణాలల్లో వివిధ వస్తువులు, స్వీట్లు, తిను బండారాలను కొనుగోలు చేశారు. కార్యక్రమాలకు పాలకవర్గం సభ్యులతో పాటు చల్మెడ, నందిగామ, కోనాపూర్‌ గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.


logo