శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 02, 2020 , 23:35:06

ఏడుపాయలలో భక్తుల సందడి

ఏడుపాయలలో భక్తుల సందడి

పాపన్నపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు భక్తులు పెద్ద సంఖ్యల తరలివచ్చారు. ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది రవికుమార్‌, సిద్దిపేట శ్రీనివాస్‌, సూర్యశ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకర్‌శర్మ, పార్థీవశర్మ, రాజశేఖర్‌శర్మ, నాగరాజ్‌శర్మ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు బందోబస్తు చర్యలు చేపట్టారు. logo