మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 01, 2020 , 23:55:47

ప్రయాణ జాగ్రత్తలు పాటించాలి

ప్రయాణ జాగ్రత్తలు పాటించాలి

తూప్రాన్‌ రూరల్‌: సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలన్న లక్ష్యంతోనే డ్రైవింగ్‌ చేయాలని తూప్రాన్‌ సీఐ స్వామిగౌడ్‌ ఆటో, డీసీఎం డ్రైవర్‌లకు సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడంతోనే తరచూ రోడ్డు ప్రమాదాలు అనివార్యమవుతున్నాయన్నారు. తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పలు ప్రైవేట్‌ డ్రైవర్‌లకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ సుభాష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ...44వ నెంబర్‌ జాతీయ రహదారి ప్రమాదకరమైందన్నారు. ఈ జాతీ య రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారముంటుందన్నారు. మద్యం సేవించడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదన్నారు. అతివేగం, హెల్మెడ్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం శ్రేయస్కరం కాదన్నారు. మైనర్‌లకు బైక్‌లు ఇవ్వరాదన్నారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, ఆప్తులను గుర్తుంచుకొని డ్రైవింగ్‌ చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను తీయరాదన్నారు. రోడ్డు భద్రత నియామాలు పాటించి డ్రైవింగ్‌ చేస్తే మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలుసుభాష్‌, యాదవరెడ్డి, పోలీస్‌ సిబ్బందితో పాటు పలువురు డ్రైవర్‌లు పాల్గొన్నారు.


రోడ్డు భద్రత పాటించాలి: ఆర్టీవో శ్రీనివాస్‌గౌడ్‌

గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోవాలన్న లక్ష్యంతోనే డ్రైవింగ్‌ చేయాలని జిల్లా ప్రాంతీయ రవాణశాఖ అధికారి (ఆర్టీవో) శ్రీనివాస్‌గౌడ్‌ డ్రైవర్‌లకు సూచించారు. తూప్రాన్‌ గీతాహైస్కూల్‌లో శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి. జిల్లా ఇన్సూస్పెక్టర్‌ రమేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతపై స్కూల్‌ బస్సు డ్రైవర్‌లు, విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు ఆయన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ రామాంజనేయులు, డైరెక్టర్‌లు రాఘవేందర్‌గౌడ్‌, కొడిప్యాక నారాయణగుప్తాతో పాటు డ్రైవర్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo
>>>>>>