శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 01, 2020 , 23:50:42

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

కొల్చారం :  సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉత్తమమైనది.. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, కానీ విధి నిర్వహణలో చేసిన సేవలే చిరకాలం గుర్తింపునిస్తాయని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని రంగంపేట జెడ్పీహైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు బొద్దుల రమేశ్‌బాబు పదవీ విరమణ సమావేశం శనివారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రైవేట్‌ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉన్నారన్నారు. రంగంపేట పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్‌, ఎంపీపీ మంజుల కాశీనాథ్‌, ఎంపీడీవో వామనరావు, ఎంఈవో నీలకంఠం, సర్పంచ్‌ బండి సుజాత రమేశ్‌, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్‌, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టెస్కో మాజీ డైరెక్టర్‌ రమేశ్‌, సొసైటీ చైర్మన్‌ వంజరి మల్లేశం, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ తలారి దుర్గేశ్‌, ఉపసర్పంచ్‌ మచ్చ శ్రీనివాస్‌, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రభాకర్‌, అరుణ్‌ తదితరులు ఉన్నారు.  


logo