బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 01, 2020 , 00:29:14

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచాలి

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచాలి

కౌడిపల్లి: సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యాలను నివారించవచ్చని మాజీ కేంద్రమంత్రి, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివారులోని డా.రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సదర్శించారు. మొదటగా కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయంతో పండిస్తున్న బొప్పాయి పంటను సందర్శించారు. అనంతరం జీవామృతాలు, వర్మికంపౌస్టు విధానాన్ని పరిశీలించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వర్మికంపౌస్టును గవర్నర్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ  భారతీయులు సేంద్రియ వ్యవసాయాన్ని వదిలిపెట్టి నూతన పద్ధతులకు అలవాటు పడ్డామన్నారు. ప్రతి చిన్న రైతు గోవులను సంరక్షించాలన్నారు. ఆవు పేడతో కూడిన జీవామృతాన్ని తయారుచేసుకుని పంటలను పండించాలన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్కో గోవుకు రూ.25వేల సాయం అందిజేయడం జరుగుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించాలనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో గత సంవత్సరం 5వేల ఎకరాల్లో సేంద్రి య వ్యవసాయం చేశామని ఈ సంవత్సరం 50వేల ఎకరాల్లో సేంద్రి య వ్యవసాయం చేయడానికి టార్గెట్‌ తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 16 కృషివిజ్ఞాన కేంద్రాలను కేంద్రప్రభు త్వం ఏర్పాటు చేసిందన్నారు. 


ఏకలవ్య ఫౌం డేషన్‌ సహకారంతో తునికిలో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేం ద్రాన్ని ఇక్కడి రైతులు సద్వినియోగం చేసుకుని సేం ద్రియ వ్యవసాయాన్ని పెంపొందిచాలన్నారు. నర్సాపూర్‌ ప్రాంతం రాష్ట్రంలో పూర్తిగా వెనకబడ్డ ప్రాంతమని, ఇక్కడి రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని ఏకలవ్య ఫౌండేషన్‌ నిర్వాహకులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయాన్ని రైతులకు అందించాలనే సంకల్పం కలిగిన దివంగత నాయకులు డా.రామానాయు డు ఈ ఏకలవ్య ఫౌండేషన్‌కు 30ఎకరాలు భూమిని ఉచితం గా ఇచ్చారని గుర్తుచేశారు. డా. రామానాయుడు ఆశయా న్ని ఏకలవ్య ఫౌండేషన్‌ నెరవేర్చాలని, ఆయన కుటుంబసభ్యులను గవర్నర్‌ సమావేశంలో అభినందించారు.ఈ ప్రాంతం లో అడవిపందులు, కోతుల బెడద తీవ్రంగా ఉందని నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గవర్నర్‌ అడవిపందులు, కోతులు, పశువుల బెడదనుంచి పంటలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వినోద్‌రావు, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త,అడ్వయిజర్‌ శ్యాంసుందర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ రాణాప్రతాప్‌, డీఎస్పీ కృష్ణారెడ్డిలతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు సింగాయిపల్లి గోపి, జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌, జిల్లా పార్టీ ఇన్‌చార్జి లింగమయ్య, నర్సాపూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు బుచ్చేశ్‌యాదవ్‌, రాజేందర్‌, సంగసాని సురేశ్‌లతో పాటు  రైతులు పాల్గొన్నారు. 


గవర్నర్‌ను సత్కరించిన బీజేపీ నేతలు...

కౌడిపల్లి మండలం తునికి గ్రామశివారులోని కృషివిజ్ఞాన కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను బీజేపీ జిల్లా నాయకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. సేంద్రియ వ్యవసాయ పంటలను పరిశీలించిన అనంతరం బండారు దత్తాత్రేయను బీజేపీ రాష్ట్ర నాయకులు సింగాయిపల్లి గోపి, చోళ్ల రాంచరణ్‌, గడ్డం శ్రీనివాస్‌, రమేశ్‌గౌడ్‌, రాజేందర్‌, రాకేశ్‌లతో పాటు పార్టీ నాయకులు  ఘనంగా సత్కరించారు. 


logo