శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 31, 2020 , 00:30:48

మంత్రులను కలిసిన మున్సిపల్‌ చైర్మన్లు

మంత్రులను కలిసిన మున్సిపల్‌ చైర్మన్లు

మెదక్‌, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో గురువారం మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మెదక్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేయాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌లు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


రామాయంపేట : పురపాలిక అభివృద్ధికి నిధులను కేటాయించాలని రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితెందర్‌గౌడ్‌ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులను కోరారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్‌ అబివృద్ధికి తమ సహకారం  ఉంటుందని, పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించినట్లు తెలిపారు. చైర్మన్‌ జితెందర్‌ గౌడ్‌ వెంట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాఫ్‌ యాదగిరి ఉన్నారు.


మంత్రి హరీశ్‌రావును కలిసిన మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ 

ఆర్థికశాఖ మంత్ర తన్నీరు హరీశ్‌రావును హైదరాబాద్‌లో గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌గా తన ఎన్నికకు సహకరించిన మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవెందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


logo