శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 31, 2020 , 00:29:09

అభివృద్ధి, సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపించాయి

అభివృద్ధి, సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపించాయి

తూప్రాన్‌ రూరల్‌ : సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాయని రాష్ట్ర ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డిలు అన్నారు. తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రజలను ఎంతాగానో ఆకర్శించాయన్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతోనే అన్నారు.  


బీజేపీ, కాంగ్రెస్‌లను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. బీజేపీ కేంద్ర పాలనలో ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదన్నారు. పెట్రోల్‌, డిజిల్‌, కిరోసిన్‌ ధరలు అధిక మొత్తంలో పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ఈ సమావేశంలో  టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, జెడ్పీటీసీ బస్వన్నగారి రాణి సత్యనారాయణగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ఎంపీపీ గడ్డి స్వప్నవెంకటేశ్‌, మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్‌ గడప దేవేందర్‌గౌడ్‌, ఎంపీటీసీలు సంతోశ్‌రెడ్డి, పంజాల వెంకటమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు చెలిమెల రఘుపతి తదితరులు పాల్గొన్నారు.


తూప్రాన్‌ మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయం..  

- మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ 

తూప్రాన్‌ మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా  కృషి చేస్తానని మున్పిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. 16 వార్డుల్లోని ప్రజల ఆమోద యోగ్యం మేరకే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, చైర్మన్‌లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, పన్యాల భూపతిరెడ్డి, మాజీ చైర్మన్‌లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డిల సహకారంతో తూప్రాన్‌ పట్టణాన్ని నందనవనంగా రూపుదిద్దుతామన్నారు. తనకు చైర్మన్‌ పదవీ కట్టబెట్టిన తూప్రాన్‌ పట్టణ ప్రజలకు, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. 


logo