మంగళవారం 31 మార్చి 2020
Medak - Jan 29, 2020 , 23:20:08

అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించండి

అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించండి

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి కొత్త పాలకవర్గం నిర్వీరామంగా కృషి చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డిలు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఎలాంటి సమస్యల లేకుండా వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీ కొత్త చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌తో పాటు పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌లు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డిలను నగరంలోని వారి నివాసాల్లో వేర్వేరుగా కలిశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డిలను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లతో పాటు కౌన్సిలర్‌లను వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తూప్రాన్‌ పట్టణ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని నూతన పాలకవర్గానికి సూచించారు. తూప్రాన్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత కొత్త పాలకవర్గానిదేనన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్‌, చింత రవీందర్‌రెడ్డి, బొంది అరుణ వెంకట్‌గౌడ్‌, మామిండ్ల జ్యోతికృష్ణ, చెలిమెల ప్రియాంక, ఏర్పుల ఉమాసత్యలింగం, తలారి పద్మమల్లేశ్‌, బానాపురం రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు చెలిమెల రఘుపతి, గంగుమల్ల నాగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


పాలకవర్గానికి స్వీట్లు తినిపించిన ఫుడ్స్‌ మాజీ  చైర్మన్‌  

తూప్రాన్‌ మున్సిపల్‌ కొత్త చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌తో పాటు కౌన్సిలర్‌లకు ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి బుధవారం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం కొత్త పాలకవర్గానికి స్వీట్లు తినిపించారు.


logo
>>>>>>