శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 29, 2020 , 23:18:09

ప్రారంభానికి సిద్ధంగా ‘డబుల్‌' ఇండ్లు

ప్రారంభానికి సిద్ధంగా ‘డబుల్‌' ఇండ్లు

చిన్నశంకరంపేట : మండలంలోని వివిధ గ్రామాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో 260డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా... చిన్నశంకరంపేటకు 100, కొర్విపల్లికి 20, కామారానికి 40, మిర్జాపల్లికి40, రుద్రారానికి 20, గజగట్లపల్లికి 40చొప్పున మంజూరయ్యాయి. కొర్విపల్లి, కామారం, మిర్జాపల్లి గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చిన్నశంకరంపేటతో పాటు రుద్రారం, గజగట్లపల్లి గ్రామాల్లో కొన్ని కారణాల వల్ల పనులు ప్రారంభం కాలేదు. మిర్జాపల్లిలో40 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటికి రంగులు సైతం వేశారు. ఇంట్రా పనులు జరుగాల్సి ఉంది. వాటి పనులను త్వరలో పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


మరో నెల రోజుల్లో పనులు పూర్తి చేసి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కామారంలో 40 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు రంగులు వేస్తున్నారు. కొర్విపల్లిలో స్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. కామారం, మిర్జాపల్లి గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కాలనీలో త్వరలో ఇంట్రాపనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 


logo