గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 29, 2020 , 23:17:35

ప్రతీ పని వివరాలు రికార్డులో నమోదు చేయాలి

ప్రతీ పని వివరాలు రికార్డులో నమోదు చేయాలి

హవేళిఘనపూర్‌: గ్రామాల్లో ప్రస్తుతం చేపడుతున్న పనులు పూర్తయిన వెంటనే వాటిని రికార్డులో నమోదు చేసినట్లయితే నిధులు వచ్చిన వెంటనే మంజూరు చేసే వీలుంటుందని, అందుకోసం పంచాయతీ కార్యదర్శులు ప్రతీ పనిని రికార్డు చేసి సిద్ధంగా ఉంచాలని జడ్పీ సీఈవో లక్ష్మీబాయి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హవేళిఘనపూర్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామానికి శ్మశాన వాటిక, డంప్‌ యార్డు నిర్మాణం, నర్సరీల ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలన్నారు. మండలంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేసి, నర్సరీలో ప్రజలకు అవసరమైన విత్తనాలను విత్తుకొని వాటిని జాగ్రత్తగా పెంచేలా చూడాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో చేపట్టిన ప్రతీ పనికి సంబంధించి పూర్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే పనికి సంబంధించిన డబ్బులను సంబంధిత ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా రికార్డులు తప్పనిసరిగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిబాబా, ఎంపీవో ప్రవీణ్‌, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 


logo
>>>>>>