శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medak - Jan 28, 2020 , 02:44:34

ఆనందం...హర్షం

ఆనందం...హర్షం

మెదక్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో 148 మంది సెర్ప్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో సంవత్సరాలు సెర్ప్‌, ఐకేపీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చడంతో సెర్ప్‌, ఐకేపీ ఉద్యోగుల కల సాకారమైంది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం జిల్లాలోని అన్ని మహిళా సంఘాల సమాఖ్య కార్యాలయాల ఎదుట సెర్ప్‌, ఐకేపీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా సెర్ప్‌, ఐకేపీ ఉద్యోగులు మాట్లాడుతూ మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం, వీఎల్‌ఆర్‌ వర్తింపజేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు మంచి లాభాలు రావడానికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు నెలకొల్పుతామని, ఐకేపీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్‌, ఐకేపీ సిబ్బంది నాగరాజు, లక్ష్మీనర్సమ్మ, సాయిలు, ప్రకాశ్‌, ఇందిర, కెన్నడి, మోహన్‌, సురేశ్‌, సూసిల్వ, శంకర్‌, అంజయ్య, వెంకట్‌, లాలునాయక్‌, స్వామి, మహాలక్ష్మి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 


చిన్నశంకరంపేటలో...

చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేటలో ఐకేపీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, వివిధ గ్రామాల సీసీలు పాల్గొన్నారు. 


పాపన్నపేటలో...

పాపన్నపేట : పాపన్నపేటలో సోమవారం ఐకేపీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని ఇటీవల ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, ఐకేపీ సిబ్బంది వెంకటేశ్‌, శివరంజి, ఇందిరా, చోటేమియా, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. 


logo