సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 28, 2020 , 02:40:55

గులాబీ వైపే...

గులాబీ వైపే...

మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని స్వతంత్ర అభ్యర్థులు గులాబీ పార్టీ వైపే నిలిచారు. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పంబాల రాంచందర్‌, చలిమే లక్ష్మి, ఎర్రగొల్ల లత సైతం చైర్మన్‌ అభ్యర్థి మురళీయాదవ్‌కు మద్దతును ప్రకటించారు. మెదక్‌లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన దొంతి లక్ష్మి, ఎంఐఎం పార్టీ నుంచి గెలుపొందిన శంసున్నీసాబేగం, రామాయంపేటలో చిలుక గంగాధర్‌ టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థులకు మద్దతును ప్రకటించారు. తూప్రాన్‌లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఏర్పుల ఉమ, చలిమెల ప్రియాంకలు సైతం టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి రవీందర్‌గౌడ్‌కు మద్దతును తెలిపారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిల ముందస్తు వ్యూహంతో స్వతంత్రులు, ఎంఐఎం పార్టీ అభ్యర్థులు గులాబీ పార్టీకే మద్దతును తెలియజేశారు.


మెదక్‌లో బీజేపీ మద్దతు.. 

మెదక్‌లో గెలిచిన ముగ్గురు బీజేపీ అభ్యర్థులు చోళ మేఘమాల, మేడిశెట్టి చందన, పెండ్యాల నిర్మల టీఆర్‌ఎస్‌ పార్టీ  చైర్మన్‌గా అభ్యర్థిగా ప్రతిపాదించిన తొడుపునూరి చంద్రపాల్‌కు మద్దతును ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా మేడి కళ్యాణి బరిలో ఉండగా ఇక్కడ పోటీ జరిగింది. మొత్తం 24మంది మద్దతుతో చైర్మన్‌గా తొడుపునూరి చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌గా మల్లికార్జున్‌గౌడ్‌లు ఎన్నికయ్యారు.  మొత్తంగా స్వతంత్రులు, ఎంఐఎం పార్టీ అభ్యర్థులు అందరూ గులాబీ పార్టీ మద్దతును ప్రకటించారు.


logo