గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 28, 2020 , 00:57:58

ఘనంగా మార్కండేయ జయంతి

ఘనంగా మార్కండేయ జయంతి


మనోహరాబాద్‌: మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలీలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మనోహరాబాద్‌లో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, మార్కెండేయ చిత్ర పటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాములు మాట్లాడుతూ... కలిసికట్టుగా ఉండి పద్మశాలి సంఘాన్ని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పుట్ట మహేందర్‌, సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, పద్మశాలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. 


వెల్దుర్తిలో...

వెల్దుర్తి: పద్మశాలి కులదైవం మార్కెండేయ జయంతి వేడుకలను సోమవారం పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజం వెంకటేశం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, మార్కెండేయ చిత్ర పటానికి పూలమాల వేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పద్మశాలీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, అన్ని పార్టీలు రాజకీయంగా పద్మశాలీలకు అవకాశాలు కల్పించాలన్నారు. పద్మశాలి సంఘం నాయకులు విఠల్‌, యాదగిరి, నాగరాజు, చందు, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 


logo